సారంగాపూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 26
నిర్మల్స్వర్ణ ప్రధాన రహదారిపై రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం సమీపంలో బుధవారం కారు, స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న జామ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానికులు నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద వివరాలు
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జామ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు స్కూటీపై జామ్ గ్రామం వైపు వెళ్తుండగా, ప్యారామూర్ గ్రామానికి చెందిన కారు బోరిగాం గ్రామం వైపు వస్తోంది. రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమం సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
సత్వర స్పందన
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన మహిళలను 108 వాహనంలో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది ప్రభాకర్, మహేష్ లు వారికి చికిత్స అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.