వెంకటాపురం, 3 September
మండలం కర్రిగుట్ట సమీపంలో బుధవారం జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో మృతి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం పరామర్శించారు. వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లిన సమయంలో ఐఈడీ పేలడంతో నాగేశ్వరరావు మృతి చెందారు.
ఐఈడీ పేలుడులో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మడకం నాగేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటాం: డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, సెప్టెంబరు 3 ( మండలం కర్రిగుట్ట సమీపంలో బుధవారం జరిగిన విషాదకర ఐఈడీ పేలుడు ఘటనలో మృతి చెందిన మడకం నాగేశ్వరరావు కుటుంబాన్ని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం పరామర్శించారు. వెదురు బొంగుల కోసం అడవికి వెళ్లిన సమయంలో ఐఈడీ పేలడంతో మడకం నాగేశ్వరరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మండలానికి చేరుకున్నారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి, మనోధైర్యం కల్పించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.












