రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
 

రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

📍 M4News – హైదరాబాద్‌, జూన్‌ 10, 2025

రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బీబీనగర్‌, సదాశివపేట, జడ్చర్లలో ఏసీబీ బృందాలు సోదాలు జరిపాయి.

🔹 బీబీనగర్‌ కార్యాలయం:

లెక్కలు చూపని రూ.61,430 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ 12 మంది ఏజెంట్లను గుర్తించారు.

🔹 జడ్చర్ల కార్యాలయం:

తనిఖీల్లో రూ.30,900 నగదు ఏసీబీ చేతికి చిక్కింది.

🔹 సదాశివపేట కార్యాలయం:

ఇక్కడ రూ.5,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

తదుపరి దర్యాప్తులో అధికారులు, రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన అనేక దస్త్రాలను సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఆఫీస్‌లోనే నిల్వ ఉంచినట్టు గుర్తించారు. అంతేకాదు, కార్యాలయాల్లో సీసీ కెమెరాలు కూడా లేకపోవడం ఏసీబీ దృష్టికి వచ్చింది.

💬 ఏసీబీ వర్గాల ప్రకారం, అవినీతి నిరోధక దళం తనిఖీలు మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగనున్నట్లు సమాచారం

Join WhatsApp

Join Now

Leave a Comment