బీజేపీలోకి అబ్బగోని అశోక్ గౌడ్
400 మంది బీసీ నాయకులు, మహిళలు, యువతతో కలిసి చేరిక
మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ, డిసెంబర్ 08 :
తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు దాదాపు 400 మంది మహిళలు, బీసీ నాయకులు, యువకులు, కార్యకర్తలు బాల్కొండ మండల కేంద్రంలోని వి-ఫంక్షన్ హాల్లో బీజేపీలో చేరిక చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి, పార్టీ నేత ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.అశోక్ గౌడ్ మాట్లాడుతూ— భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు, మాజీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి ఆదేశానుసారం బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనల మధ్య అసలు మార్పు ఏదీ కనిపించలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బీసీలకు అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై అసహనం
కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నట్లు 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం 17 శాతం రిజర్వేషన్లకే పరిమితం చేయడం తీవ్ర అన్యాయమని తెలిపారు. బీసీల కోసం బీజేపీ ప్రభుత్వం నిజమైన చర్యలు తీసుకుంటోందని, 2026 లోపు బీసీ కులగణన దేశవ్యాప్తంగా చేపడుతున్నట్టు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారని గుర్తుచేశారు. “బీసీలకు న్యాయం చేయగలిగేది బీజేపీ మాత్రమే” అని అబ్బగోని అశోక్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముసుగు భూమేశ్వర్, లింగా గౌడ్, ముస్కు రాజేశ్వర్, బీసీ నాయకులు సూరి నీడ దశరథ్, దండు జ్యోతి, గట్ల సురేష్, గంగామణి, బండి నారాయణతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు మండలాలు, గ్రామాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు, యువకులు, బీసీ నాయకులు పాల్గొన్నారు.