FMIS పోర్టల్‌లో ఆధార్, మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి — లేకపోతే అక్టోబర్ వేతనాలు నిలుపుదల

FMIS పోర్టల్‌లో ఆధార్, మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి — లేకపోతే అక్టోబర్ వేతనాలు నిలుపుదల

FMIS పోర్టల్‌లో ఆధార్, మొబైల్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి — లేకపోతే అక్టోబర్ వేతనాలు నిలుపుదల

 

  • రాష్ట్ర ఆర్థిక శాఖ తాజా ఆదేశాలు

  • IFMIS HR మాడ్యూల్‌లో ఆధార్, మొబైల్ నెంబర్ తప్పనిసరి

  • వివరాలు అప్డేట్ చేయని ఉద్యోగులకు అక్టోబర్ వేతనాలు నిలుపుదల



రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో ఖజానా ద్వారా వేతనాలు పొందే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి IFMIS పోర్టల్‌లోని HR మాడ్యూల్‌లో ఆధార్ మరియు మొబైల్ నెంబర్ వివరాలను తక్షణమే అప్డేట్ చేసుకోవాలి. ఈ వివరాలు నమోదు చేయని ఉద్యోగులకు అక్టోబర్ నెల వేతనాలు మంజూరు కానని జిల్లా ఖజానా అధికారి సరోజ తెలిపారు.



రాష్ట్ర ఆర్థిక శాఖ తాజా ఆదేశాల ప్రకారం, నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత వివరాలు IFMIS పోర్టల్‌లోని HR మాడ్యూల్ ద్వారా అప్డేట్ చేయడం తప్పనిసరి అయింది. ఖజానా శాఖ ద్వారా వేతనాలు పొందే ప్రతి ఒక్క ఉద్యోగి తమ ఆధార్ కార్డు నెంబర్ మరియు మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి.

ఈ వివరాలు పూర్తి చేసిన తర్వాతే అక్టోబర్ నెల వేతనాల బిల్లులు ప్రాసెస్ చేయబడతాయి. వివరాలు నమోదు చేయని పక్షంలో DDOలకు IFMIS పోర్టల్‌లో అక్టోబర్ నెల బిల్లులు ఓపెన్ కావు. కాబట్టి అన్ని శాఖల DDOలు తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలు కచ్చితంగా నమోదు చేయించాలి.

ఆధార్, మొబైల్ వివరాలు అప్డేట్ చేయని ఉద్యోగులకు అక్టోబర్ నెల వేతనాలు మంజూరు కావని, అప్డేట్ చేసిన వివరాలను వేతనాల బిల్లుతో పాటు ధృవీకరించి జతపరచాలని జిల్లా ఖజానా అధికారి సరోజా  ఒక ప్రకటనలో తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment