ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 30 – జిల్లాలోని ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఉండేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఆధార్ నమోదు ప్రగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలందరికీ ఆధార్ అనేది అవసరమని, ఆధార్ లేని వారిని గుర్తించి, వీలైనంత త్వరగా వారి నమోదు పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన పత్రాల వివరాలు స్పష్టంగా తెలియజేయాలని, విద్యాసంస్థలు, అంగన్వాడి కేంద్రాల్లో ఆధార్ లేని పిల్లల వివరాలు సేకరించి వారికి కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. శిశువులు పుట్టిన వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలు తల్లిదండ్రులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందించి, ఆధార్ కోసం నమోదు చేసుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. మారుమూల గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అధిక జనాభా కలిగిన పంచాయతీలను గుర్తించి ఆధార్ కేంద్రాలను పెంచాలని సూచించారు. బ్యాంకుల్లో ఆధార్ కేంద్రాల విస్తరణపై దృష్టి సారించాలని తెలిపారు. నూతన ఆధార్ కార్డులు మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న కార్డుల వివరాలు సరిగ్గా ఉండేలా అప్డేట్ చేసుకోవడం కూడా అవసరం. త్వరలోనే నియోజకవర్గ స్థాయిలో మెగా ఆధార్ సహాయక శిబిరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఆధార్ జారీ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదని, అప్డేట్ లేదా జారీ కొరకు అధిక ఛార్జీలు వసూలు చేయరాదని హెచ్చరించారు. ఈ దిశగా అధికారుల నియంత్రణ అవసరమని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, UIDAI RO ఆఫీస్ హైదరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ శోభన్, ఎల్డిఎం రామ్ గోపాల్, ఈడిఎం నదీం, పోస్టల్, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment