బిజెపి మహాధర్నా లో పాల్గొన్న మహిళ మోర్చా నాయకురాలు

ఎమ్4 న్యూస్ ( ప్రతినిది )

భైంసా : అక్టోబర్ 25

మూసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా లో బిజెపి సభ్యత్వ నమోదు జిల్లా కో ఆర్డినేటర్ సిరం సుష్మ రెడ్డి పాల్గొన్నారు.. భైంసా నుండి మహిళలతో కలిసి ఆమె హైదరాబాద్ కు వెళ్లారు.. మల్గాజిగిరి పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ ని కలిశారు.ఈ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదలకు అన్యాయం చేస్తుందన్నారు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలాయాపన చేయడానికి డ్రామా లాడుతున్నారన్నారు.. ఇకనైనా మహిళ లకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఆమె వెంట లోకేశ్వరం మండల మహిళ నాయకురాలు సరస్వతి తో పాటు పలువురు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment