షాద్ నగర్ లో మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీహరి తదితరులకు ఘన స్వాగతం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో మంత్రులను కలుసుకున్న కాంగ్రెస్ నాయకులు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ కేంద్రంలో శుక్రవారం ఉదయం రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ వాకిట శ్రీహరి, నారాయణ పేట మహిళా ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి తదితరులను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వాగతం పలికారు. మక్తల్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంత్రులు దామోదర్ రాజనర్సింహ వాకిట శ్రీహరి తదితరులు ఉమ్మడి పాలమూరు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద కేశపేట బైపాస్ రోడ్డులో కాన్వాయ్ కాసేపు ఆపి స్థానిక కాంగ్రెస్ శ్రేణులను ఎమ్మెల్యే వేల్లపల్లి శంకర్ తదితరులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు పూల బొకేలతో ఘనంగా సంబంధించి ఆహ్వానించారు. మంత్రుల రాక సందర్భంగా నియోజకవర్గంలోని ఆయా మండలాల నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ తదితరులు మంత్రులను సన్మానించారు.