నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
నిర్మల్, (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి)
నిర్మల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటిల్, ముధోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం తెలిపారు.
అలాగే నిర్మల్ జిల్లా అబ్జర్వర్, అవేజ్ కుబేర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనెలు కళ్యాణ్ కూడా సీఎం పర్యటన సందర్భంగా పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రికి నాయకులు వివరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.