బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఐక్య పోరాటం

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఐక్య పోరాటం

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం ఐక్య పోరాటం
ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణ – బీసీ జేఏసీ బంద్‌కు మద్దతు
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకె ప్రభాకర్

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ ప్రతినిధి అక్టోబర్ 17

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకె ప్రభాకర్ తెలిపారు.
బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చే వరకు ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. 18న జరగనున్న బీసీ–జేఏసీ రాష్ట్ర బంద్‌కు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సుంకె ప్రభాకర్ మాట్లాడుతూ, 42% రిజర్వేషన్ల పరిరక్షణ అనేది కేవలం బీసీల సమస్య కాదని, ఇది సామాజిక న్యాయానికి సంబంధించిన పోరాటమని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, సమానత్వ సమాజ నిర్మాణం కోసం ప్రతి వర్గం ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం బీసీ వర్గాల రిజర్వేషన్ల విషయంలో సరైన న్యాయపరమైన వ్యూహం సిద్ధం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 243A ప్రకారం సరైన జనాభా లెక్కలు, సామాజిక–ఆర్థిక అధ్యయనం ఆధారంగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు సామాజిక న్యాయానికి విరుద్ధమని, ఉద్యమాన్ని విజయవంతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని సుంకె ప్రభాకర్ అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment