నూతన ఉపాధ్యాయులకు సన్మానం

#TeacherRecognition #Education #M4News

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

నిర్మల్ జిల్లా: అక్టోబర్ 20

సారంగాపూర్: డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని గ్రామ మాజీ సర్పంచ్ సుజాత-నర్సారెడ్డి వారి స్వగృహంలో ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అందే సాయి కృష్ణ, రవీందర్ రెడ్డి, చింతకింది ప్రవళిక, దేవి సూర్య శ్రీకర్ లను శాలువాతో సన్మానించారు.

“ఎంత కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం ఆనందదాయకం. సమాజంలో ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు ఉంటుందని” అన్నారు సుజాత-నర్సారెడ్డి.

ఈ సందర్భంగా, ఉపాధ్యాయులు సమాజానికి అందిస్తున్న సేవల ప్రాముఖ్యతను గుర్తించి, వారి కృషిని ప్రశంసించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment