విసికి ఔట్సోర్సింగ్ సంఘ సభ్యుల సన్మానం
ఎమ్4 ప్రతినిధి ముధోల్
రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో బుధవారం తమ ప్రత్యేక చాంబర్లో కలిసి ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘము ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టిన కళాశాల వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగ కళాశాల వైస్ ఛాన్స్లర్ గోవర్ధన్ మాట్లాడుతూ క్యాంపస్ లో ఉన్న ఉద్యోగులు అందరూ కలిసి మెలిసి కళాశాలలో ఎటువంటి చెడు పేరు రాకుండా పని చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో నవకాంత్, వాసు, శైలేష్, శ్రీనివాస్, పద్మారావు, మధు తదితరులు పాల్గొన్నారు.