భైంసా లో కార్మికుల సమస్యకు విజయవంతమైన పరిష్కారం

భైంసా లో కార్మికుల సమస్యకు విజయవంతమైన పరిష్కారం

భైంసా లో కార్మికుల సమస్యకు విజయవంతమైన పరిష్కారం

ఏఎల్ఓ వినోద్ సమక్షంలో శాంతియుతంగా ముగిసిన చర్చలు

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి అక్టోబర్ 17

భైంసా లో కార్మికుల సమస్యకు విజయవంతమైన పరిష్కారం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో స్థానిక పెయింటర్ కార్మికులు మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన (మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్) కార్మికుల మధ్య నెలకొన్న సమస్యను శుక్రవారం లేబర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో విజయవంతంగా పరిష్కరించారు. ఈ సమావేశానికి ఏఎల్ఓ వినోద్ అధ్యక్షత వహించగా, ఎఐటియుసి, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మారగొని ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. పెయింటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మిక ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు:-

స్థానిక కార్మికులకు 70% మరియు ఇతర రాష్ట్రాల కార్మికులకు 30% పనులు కేటాయించాలన్నారు.. ప్రతి కాంట్రాక్టర్ ఐదుగురికి మించి కార్మికులను నియమించరాదని పేర్కొన్నారు. ఎనిమిది గంటల పని సమయాన్ని చట్టప్రకారం కచ్చితంగా అమలు చేయాలని కోరారు.ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా భైంసా పెయింటర్స్ వర్కర్స్ యూనియన్‌లో సభ్యత్వం పొందాలని సూచించారు.ఈ నిర్ణయాలు చట్టపరంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఏఎల్ఓ వినోద్ తెలిపారు. అలాగే, ఈ విషయంపై కలెక్టర్ ను నివేదిక సమర్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కామ్రేడ్ లతీఫ్ (యూనియన్ సలహాదారు), కామ్రేడ్ సిహెచ్ లక్ష్మణ్ (జిల్లా అధ్యక్షుడు), కామ్రేడ్ జావేద్ (ఉపాధ్యక్షుడు), కామ్రేడ్ అనిల్ సింగ్ (జిల్లా కార్యదర్శి), కామ్రేడ్ మోసిన్ (సహాయ కార్యదర్శి) మరియు అనేక మంది కార్మికులు పాల్గొన్నారు.సమావేశం చివరలో ఏఎల్ఓ వినోద్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మారగొని ప్రవీణ్ , శాంతియుత పరిష్కారం కోసం సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment