ఆగిపోయిన గుండెను మళ్లీ బతికించారు*

*ఆగిపోయిన గుండెను మళ్లీ బతికించారు*

*CPR చేసి కాపాడిన 108 సిబ్బంది*

మనోరంజని ప్రతినిధి

హైదరాబాద్: జనవరి 18
అప్పుడే పుట్టిన చిన్నారికి సీపీఆర్‌ చేసి 108 సిబ్బంది కాపాడారు. మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించిన చిన్నారికి శ్వాస అందలేదు. దీంతో చిన్నారిని, హైదరా బాద్ కు తరలించాలని డాక్టర్లు సూచించారు.

నీలోఫర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చిన్నారి గుండె ఆగింది. వెంటనే 108 సిబ్బంది స్పందించి సీపీఆర్‌ చేశారు. పైలట్‌ నవీన్‌, ఈఎంటీ రాజు సీపీఆర్‌ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు.

దీంతో 108 సిబ్బందిని పలువురు ప్రశంసిస్తు న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment