నందిపేటలో రేణుక ఎల్లమ్మ ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన

నందిపేటలో రేణుక ఎల్లమ్మ ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన

గీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం —

స్వామీజీల ఆశీర్వచనాలు, విశిష్టుల సన్మానం

మనోరంజని తెలుగు టైమ్స్ – నందిపేట, నిజామాబాద్ జిల్లా ప్రతినిధి

నందిపేటలో రేణుక ఎల్లమ్మ ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన

నిజామాబాద్ జిల్లాలోని నందిపేటలో గీత కార్మికుల సంఘం అధ్యక్షులు వి. అశోక్ గౌడ్ సంఘ గౌరవ సభ్యుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శ్రీ శ్రీ వీరపక్ష భారత నంద స్వామి, శ్రీ శ్రీ శ్రీ కేదరానంద స్వామి హాజరై, వారి చేతుల మీదుగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు.కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ( బి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి ) దాదాన్నగారి విఠల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు వి. అశోక్ గౌడ్, సంఘ గౌరవ సభ్యులు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు కలిసి నిజామాబాద్ మాజీ జడ్పి చైర్మన్ దాదాన్నగిరి విఠల్ రావును హలువ తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు గౌడ సంఘ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment