స్థానిక ఎన్నికల లబ్దికోసమే ప్రత్యేక గ్రామసభ
మనోరంజని ప్రతినిధి
ముధోల్ : జనవరి 23
స్థానిక ఎన్నికల లబ్దికోసమే ప్రత్యేక గ్రామసభలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బిజెపి మండల అధ్యక్షుడు కొరిపోతన్న, మాజీ ఎంపీటీసీ దేవోజి భూమేష్, నాయకులు తాటివార్ రమేష్ లు ఆరోపించారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరులో 2016 నుండి 2024 సంవత్సరం మధ్య మీసేవలో ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే రేషన్ కార్డు మంజూరు చేయడం అన్యాయమని, రేషన్ కార్డు లబ్దిదారులందరికి రేషన్ కార్డు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో పెద్దఎత్తున ధర్నాను చేస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో 1600 ఇల్లులు వచ్చాయని స్థానిక ఎన్నికల నేపథ్యంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రైతు బంధు, రైతు భీమా, రైతు రుణ మాఫీ కాలేదని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందేవరకు బిజెపి పార్టీ ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటుందని అన్నారు.
గ్రామ పంచాయతీ పరిధిలో మంజూరైన ఇండ్లను ఇప్పుడే కట్టుకుంటామని పలువురు అనడంతో అర్ధాంతరంగా గ్రామసభను ముగించారు. రేషన్ కార్డ్ కోసం ప్రతిఒక్కరు వందల రూపాయలు ఖర్చుపెట్టి తహసీల్దార్, గ్రామాపంచాయతి కార్యాలయాల చుట్టూ తీరిగారని అన్నారు.
సర్వే చేసిన దానిలో ప్రభుత్వం చిత్తశుద్ధితో అర్హులను ఎంపిక చేయాలని అన్నారు. పార్టీలు వేరైనా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరారు. వారితో పాటు జంబుల ప్రసాద్, సపటోళ్ల పోతన్న, సాయినాథ్, పలువురు నాయకులు వున్నారు