విద్యారంగంలో
వెలుగుతున్న జ్ఞాన దీపం
డాక్టర్ కందుకూరి రమేష్
(నవంబర్ 2 ఇందిరాగాంధీ
సార్వత్రిక విశ్వవిద్యాలయం
అడిషనల్ డైరెక్టర్గా పదవీ విరమణ
పొందుతున్న డాక్టర్ కందుకూరి
రమేష్ గారి సన్మాన సభలో
సమర్పించిన అభినందన కవిత )
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది
అన్నట్లు కందుకూరి రమేష్
విద్యార్థి దశ నుండే ఉత్తమ
విద్యార్థిగా అధ్యాపకుల
మన్ననలకు ప్రోత్సాహానికి
పాత్రుడయ్యాడు
పట్టుదల క్రమశిక్షణ ఆత్మస్థైర్యం
అంకితభావం ఆయుధాలుగా
అభ్యుదయ ఆలోచనలతో
తనజీవన మార్గాన్ని ఎంచుకొని
ఉన్నత శ్రేణిలో పాసై ఉత్తమ
విదార్థిగా ఆదర్శ విద్యార్థిగా
గుర్తింపు పొందారు
రమేష్ విధార్థి దశనుండే
సూర్యాపేట ప్రాంతంలో ధర్మభిక్షం
బి ఎన్ రెడ్డి ప్రభృతుల వామపక్ష
భావజాల నేపథ్యంలో అభ్యుదయ
ఉద్యమంలో పాల్గొన్నారు.
అభ్యుదయ ఆలోచనలతో
జీవితాన్ని ప్రారంభించిన రమేష్
ఉన్నత ఉత్తమ విద్యావేత్తగా
ఎదిగారు
జాతీయ అంతర్జాతీయ
విద్యా సదస్సుల్లో ప్రభావశీలమైన
ప్రసంగాలు చేసి విద్యారంగానికి
దశ దిశ నిర్దేశం చేసిన ప్రముఖ
విద్యావేత్తగా రాణించారు
మనిషి జీవితంలో ఉద్యోగం
చేయడం ఒక ఎత్తైతే ఉద్యోగం
చేసిన విద్యారంగంలో ( సంస్థల్లో)
ప్రభావ శీల సంస్కరణలకు
పునాదులు వేయడం మరొక ఎత్తు
రమేష్ గారు విద్యారంగంలో
ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ
ఉద్యోగ భాద్యతలను నిర్వహించిన
ప్రభావశీల వ్యక్తితత్వానికి
నిదర్శనం వృతి నిబద్ధత
క్రమశిక్షణ ప్రగతి శీల
కార్యాచరణకు కందుకూరి
రమేష్ గారు ఆదర్శం
ఉన్నతవిలువలకు బోధనకు
అభ్యసనకు అధ్యయనానికి
పునాదులు వేశారు
సూర్యాపేట జిల్లా తిమ్మాపురం
గ్రామంలో పాఠశాల విద్య
ఉస్మానియా యూనివర్సిటీలో
ఎం ఏ (చరిత్ర) పి హెచ్ డి
తెలంగాణ సాయుధ పోరాటం
రాజకీయ సైద్ధాంతిక విశ్లేషణ
అనే అంశంపై ఎం ఫిల్, ఆంధ్ర
రాష్ట్రంలో వామపక్ష ఉద్యమ
చరిత్ర అంశంపై పిహెచ్ డి
పూర్తి చేశారు.
తెలంగాణ సామాజిక చరిత్ర
అధ్యయనానికి ఈ రెండు గ్రంథాలు
ప్రామాణిక గ్రంథాలుగా నిలవడం
గమనార్హం.
తెలంగాణ ఉద్యమానికి వీరి
రచనలు దోహదం చేశాయి .
తెలంగాణ చరిత్ర అభివృద్ధి
సంక్షేమం సవాళ్ళకు పరిష్కారానికి
చారిత్రిక భూమికను అందించారు.
వీరి రచనలు తెలంగాణ
ఉద్యమానికి ఊపిరిగా నిలిచాయి.
యువజన సాధికారిత మానవ
హక్కులు సామాజిక అంశాలపై
విస్తృతరచనలుచేశారు.
విద్యారంగంపై 5 గ్రంథాలను
రచించారు
మధ్యతరగతి కుటుంబంలో
జన్మించిన రమేష్ సాధారణ
ఉపాధ్యాయులుగా జీవితాన్ని
ప్రారంభించి నిరంతరం
అధ్యయనం అభ్యాసనం
అధ్యాపకత్వంతో
విద్యారంగంలో సామాజిక
స్పృహతో పరిశోధనలో
ప్రతిభాపాటవాలను పెంచుకొని
ఎన్ సీ ఆర్ టి నేషనల్ లిటరసీ మిషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వార
ఉత్తమ అధ్యాపక అవార్డులతో
సత్కరించబడడం అధ్యాపక
లోకానికి గర్వకారణం
35 సం”గా విద్యారంగంలో
గణనీయమైన సేవలు చేశారు
విద్యార్థి దశనుండే అభ్యుదయ
ఉద్యమంలో చురుకుగా
పాల్గొన్న అభ్యుదయవాది
సామాజిక అంశాలపై విస్తృత
రచనల తో సమాజాన్ని చైతన్య
పరిచిన విద్యాతత్వ చరిత్రకారుడు
వెలుగుచున్న దీపమే మరొక
దీపాన్ని వెలిగిస్తుంది అన్నట్లు
రమేష్ చదువుతూనే విద్యా
వికాసం కోసం గ్రామీణ ప్రాంత
విద్యార్థులకు నాణ్యమైన విద్యను
అందించారు జవహర్ నవోదయ
విద్యాలయాల ప్రిన్సిపల్ గా
పనిచేసి విద్యాసంస్థల్లో మెరుగైన
బోధన మౌలిక సౌకర్యాలతో
అనేక వేల మంది విద్యార్థులను
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో
విజేతలుగా నిలవడానికి
మెలకువలు నేర్పిన
సలహాదారులు
దూరవిద్య కౌన్సిల్ డిప్యూటీ
డైరెక్టర్ యూనివర్సిటీ గ్రాంట్స్
కమిషన్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్గా
బోధనలో నూతన పద్ధతులు
అనే అంశంపై భారత దేశ
ప్రతినిధిగా జపాన్ పర్యటించారు
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక
విశ్వవిద్యాలయం హైదరాబాద్
ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు
కావలసిన భూమిని
సమీకరించడంలో రమేష్
చేసిన కృషి విశేషమైనది
విద్యార్థులను విద్యా క్రీడా
సాసంస్కృతిక సైన్స్
సాహితీ సాంకేతిక రంగాల్లో
ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన
ఉత్తమ అధ్యాపకులు
కాలానుగుణంగా కంప్యూటర్ విధ్య
కమ్యూనికేషన్ స్కిల్స్ మానసిక
ఒత్తిడిని తగ్గించడానికి అందరికీ
విద్య అందరికీ అందరికి ఆరోగ్యం
అందించాలనే లక్ష్యంతో యోగ
కోర్సులను విద్యాసంస్థల్లో
అమలుచేసి విదార్థులకు
జీవితంలో ఎదురయ్యే సవాళ్లు
ఎదుర్కోవడంలో మెలకువలు
నేర్పించిన ఆరోగ్య ప్రదాత
ఉత్తమ అధ్యాపకులుగా నూతన
విద్యా విధానంలో లోతుపాతులను
విస్తృతంగా అధ్యయనం చేసి
అనేక ప్రసంగాలు చేసి విద్యార్తి
అధ్యాపక లోకాన్ని ప్రభావితం
చేశారు సృజనాత్మకతకు
స్ఫూర్తిదాయకతకు ఆలవాలమైన
డాక్టర్ కందుకూరి రమేష్ జీవితం
యువతకు మార్గదర్శకంగా
ఉంటుందని ఆశిద్దాం .
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
సామాజిక ఆర్థిక అధ్యయన
వేదిక కరీంనగర్
9440245771