వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. మహిళ గర్భంలో కాకుండా కాలేయంలో పెరుగుతున్న పిండం!

వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. మహిళ గర్భంలో కాకుండా కాలేయంలో పెరుగుతున్న పిండం!

వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. మహిళ గర్భంలో కాకుండా కాలేయంలో పెరుగుతున్న పిండం!

కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న మహిళ

ఆసుపత్రి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి

దీనిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారన్న వైద్యులు

ప్రపంచవ్యాప్తంగా 1954 నుంచి 1999 వరకు కేవలం 14 కేసులు మాత్రమే నమోదు

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన వైద్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ గర్భాశయంలో కాకుండా నేరుగా కాలేయంలో 12 వారాల (మూడు నెలల) పిండం అభివృద్ధి చెందుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఈ విచిత్ర ఘటన వైద్య నిపుణులను షాక్‌కు గురిచేసింది.

బులంద్‌షహర్‌కు చెందిన ఒక మహిళ గత రెండు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతోంది. దీంతో ఆమె మీరట్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన వైద్యులు నిర్ఘాంతపోయారు. ఆమె కాలేయంలో పిండం పెరుగుతున్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. పిండం గుండె కొట్టుకుంటున్నట్టు డాక్టర్ కె.కె. గుప్తా నిర్ధారించారు. అంటే అది సజీవంగా ఉండి అభివృద్ధి చెందుతోంది. మహిళకు మరింత ప్రత్యేక చికిత్స కోసం గైనకాలజిస్ట్‌కు రిఫర్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment