రాష్ట్రంలో పడకేసిన వైద్య వ్యవస్థ..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు ఔట్ ఆఫ్ స్టాక్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 21 నెలలుగా బిల్లులు విడుదల చేయకపోవడంతో, ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల సరఫరా నిలిపివేసిన డిస్ట్రిబ్యూటర్లు
వైద్యాధికారులు ఎన్ని సార్లు నచ్చజెప్పినా, బిల్లులు విడుదల అయ్యేంత వరకు మందులు సరఫరా చేయబోమని తేల్చి చెప్తున్న లోకల్ డిస్ట్రిబ్యూటర్లు
గర్భిణీలకు ఇచ్చే ఇంజెక్షన్లు, అనస్తీషియా ఇంజెక్షన్లు లాంటి కీలకమైన మందులు లేకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో వాటిని కొంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద రోగులు
ప్రజాపాలన, నిరుపేదల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుని, కనీసం ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు కూడా అందించకపోవడం దారుణమని మండిపడుతున్న బాధితులు.