అజ్ఞాత మృతుడికి అర్థవంతమైన వీడ్కోలు – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ చేత అంత్యక్రియలు
-
జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
-
బంధువులు లేని కారణంగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ముందుకు
-
హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించిన సభ్యులు
జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించగా, బంధువులు లేకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు ముందుకు వచ్చారు. టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో హిందూ సంప్రదాయం ప్రకారం స్మశానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మానవతా విలువలకు నిదర్శనంగా ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు.
జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన గుర్తు తెలియని వ్యక్తి శవానికి బంధువులు లేని కారణంగా అంత్యక్రియలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్‌ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు హిందూ సంప్రదాయం ప్రకారం స్మశాన వాటికలో అంతిమ సంస్కరణలు నిర్వహించారు.
ఈ సేవ కార్యక్రమానికి ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, సుబహన్, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు మైఖేల్ బాబు, ప్రసన్న కుమార్ తదితరులు సహకరించారు. మానవతా దృక్పథంతో అజ్ఞాత మృతుడికి గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చిన ఫౌండేషన్ సభ్యుల సేవలు ప్రశంసనీయం.
మా “శ్రీ అమ్మ శరణాలయం” వృద్ధాశ్రమంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484 లేదా 91822 44150 నంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు.