శ్రీ మహా పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలి

శ్రీ మహా పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలి

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 05

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్టాపన వేడుకలు విశేషంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో రేపు, అనగా గురువారం (06-11-2025) నాడు మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించబడనుంది. ఆలయ కమిటీ తరఫున భక్తులను అధిక సంఖ్యలో ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని, అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేయగా, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పందిళ్లు, నీటి మరియు వసతి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment