హైదరాబాద్: అక్టోబర్ 21
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు ఇప్పుడు హాట్ టాపిక్. సుప్రీం కోర్టు తీర్పుతో అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు గ్రూప్ 1 పరీక్షలను నిర్వహిస్తున్నారు.
దీంతో పోలీసులు, అధికారులు జిల్లాల వ్యాప్తంగా 46 కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
ఒక్క నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని హెచ్చరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని కోరారు.
అయితే ముందే అధికారులు నియమాలు పాటించాలని కోరుతున్న కొంతమంది అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దీనిలో భాగంగా తొలిరోజు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష సందర్భంగా హృదయాన్ని కలిచి వేసే ఘటన చోటు చేసుకుంది. దివ్యాంగురాలైన ఓ మహిళ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో ఆమెను పరీక్షకు అనుమతించలేదు పోలీసులు.
దీంతో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది, తనను పరీక్షలకు అనుమతించాలని బ్రతిమిలాడింది. అయినా అధికారులు అనుమతించలేదు. అయితే తల్లి ఏడుపును చూసిన చిన్నారి ఏడవడం అందరి హృదయాలను కలిచివేసింది.