గాన కోకిల అంజలి గడ్పాలెకు ఘన సన్మానం

Alt Name: Anjali Gadpale Felicitated for Reaching Semifinals
  • ముధోల్‌కు చెందిన అంజలి గడ్పాలె సెమి ఫైనల్స్‌కు చేరిన మీ హోనార్ చోటే వస్తాద్ కార్యక్రమం.
  • గ్రామస్తులు, ప్రముఖులు అంజలికి ఘన సన్మానం.
  • గ్రామీణ విద్యార్థిని జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం గర్వకారణం.

: నిర్మల్ జిల్లా ముధోల్ కు చెందిన అంజలి గడ్పాలె, ప్రముఖ మరాఠీ టీవీ ఛానల్ ‘స్టార్ ప్రవాహ’లో ప్రసారం అవుతున్న మీ హోనార్ చోటే వస్తాద్ కార్యక్రమంలో సెమి ఫైనల్ వరకు చేరింది. ఆమెను ఘనంగా సన్మానించారు. అంజలి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఈ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొంది.

 M4 న్యూస్, (ప్రతినిధి), ముధోల్:

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో విద్యను అభ్యసిస్తున్న అంజలి గడ్పాలె మహారాష్ట్రలోని ప్రముఖ మరాఠీ టీవీ ఛానల్ ‘స్టార్ ప్రవాహ’లో ప్రసారం అవుతున్న మీ హోనార్ చోటే వస్తాద్ సంగీత కార్యక్రమంలో సెమి ఫైనల్ వరకు చేరుకుంది. ఈ ఘనతతో ముధోల్ గ్రామం జాతీయస్థాయిలో మారుమోగింది.

అంజలి ముధోల్ కు తిరిగి వచ్చిన సందర్భంగా, ప్రముఖ పిల్లల వైద్యులు ప్రవీణ్ తుప్తేవార్ దంపతులు, వివిధ వర్గాల ప్రజలు, యువకులు, స్థానిక నాయకులు కలిసి ఆమెను శాలువాతో సన్మానించారు. గ్రామస్తులు ఈ సందర్బంగా, అంజలి గడ్పాలె జాతీయస్థాయిలో సంగీత రంగంలో ప్రాధాన్యం తెచ్చుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆమె మరిన్ని పోటీల్లో పాల్గొని తన ప్రతిభను మరింతగా చాటాలని ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామస్తుల ప్రేమాభిమానాలు తనలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించాయని అంజలి పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment