వాడి నూతన సర్పంచ్ మహేందర్‌కు ఘన సన్మానం
కామారెడ్డి జిల్లా, (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి): డిసెంబర్ 15
కామారెడ్డి జిల్లాలోని వాడి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మహేందర్‌ను, అలాగే వార్డు సభ్యులను మాజీ జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ—ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమిష్టి కృషితో వాడి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధయ్యతో పాటు గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.