త్యాగరాయ గాన సభలో సామాజిక సేవకునికి ఘన సన్మానం

Alt Name: డాక్టర్ సాప పండరికి త్యాగరాయ గాన సభలో సన్మానం
  • డాక్టర్ సాప పండరికి ఘన సన్మానం
  • శాలువాతో సత్కారం చేసిన లోకం కృష్ణయ్య
  • నేషనల్ అవార్డు, గౌరవ డాక్టరేట్ అందజేత

: నిర్మల్ జిల్లా సమాజ సేవకుడు డాక్టర్ సాప పండరికి, త్యాగరాయ గాన సభ, హైదరాబాద్‌లో ఘన సన్మానం అందింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆరాధన కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు లోకం కృష్ణయ్య చేతుల మీదుగా ఆయనను శాలువాతో సత్కరించారు. సమాజ సేవలో చేసిన విశేష సేవలకుగాను సాప పండరి ఇటీవల విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ చేతుల మీదుగా నేషనల్ అవార్డును అందుకున్నారు.

నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సమాజ సేవకుడు డాక్టర్ సాప పండరికి, త్యాగరాయ గాన సభ, హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఘన సన్మానం పొందారు. సపరాలనలో నిస్వార్థంగా, అలుపెరుగని సమాజ సేవచేసినందుకు గాను ఆయనను ఆరాధన కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు లోకం కృష్ణయ్య చేతుల మీదుగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పండరికి ఇటీవల విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ చేతుల మీదుగా నేషనల్ అవార్డును అందుకోవడం గర్వకారణమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు ధర్మారావు, లంక లక్ష్మీనారాయణ, యువకళావాహిని అధ్యక్షులు వి వెంకట రావు, కళాపోషకులు ఉమామహేశ్వర్ రెడ్డి, ప్రముఖ సినీ మేకప్ ఆర్టిస్ట్ బాపనపల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సాప పండరి మాట్లాడుతూ, సమాజ సేవలో భాగస్వామిగా చేయడం సంతోషంగా ఉందని, ఎస్.జి.డబ్ల్యు.హెచ్.ఆర్సి నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment