ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
నిర్మల్: అక్టోబర్ 19
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవీందర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు కళల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని, కలలు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొని జిల్లా పేరు నిలపాలని కోరారు. ప్రథమ స్థానంలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు.
జిల్లా నలుమూలల నుండి వివిధ పాఠశాలల విద్యార్థులు జానపద గీతాలు, జానపద నృత్యాలు, చిత్రలేఖనం, సంగీత వాయిద్యం, ఏకపాత్రాభినయం, కథ రచన వంటి అంశాలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ నరసయ్య, సిద్ధ పద్మ, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ వినోద్, పాఠశాల ప్రిన్సిపల్ మణి కుమారి, న్యాయ నిర్ణీతలు నవ్య నాగరాజు, విశ్వనాథ్ వర్మ, పోతన్న, రఫిక్, ఎర్రన్న, దేవి ప్రియ, వనజ వంటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతల వివరాలు:
- జానపద నృత్యం: తెలంగాణ గురుకుల పాఠశాల, సోఫీ నగర్
- జానపద గీతం: తెలంగాణ గురుకుల పాఠశాల, సోఫీ నగర్, నిర్మల్
- సంగీత వాయిద్యం: శ్రీ గాయత్రి ఆల్ ఫోర్స్ జూనియర్ కాలేజ్
- ఏకపాత్రాభినయం: మనీషా, తెలంగాణ గురుకుల పాఠశాల, సోఫీ నగర్, నిర్మల్
- చిత్రలేఖనం: జి శ్రీజ, తెలంగాణ గురుకుల పాఠశాల, సోఫీ నగర్, నిర్మల్
- కథ రచన: అనుదీప్తి, తెలంగాణ గురుకుల పాఠశాల, సోఫీ నగర్, నిర్మల్
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల కళా నైపుణ్యాలను ప్రోత్సహించడం జరిగింది.