ఘనంగా మాజీ ఫ్యాక్స్ చైర్మన్ జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఫ్యాక్స్ చైర్మన్ జన్మదిన వేడుకలు

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – ఇంద్రవెల్లి, డిసెంబర్ 25

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ఫ్యాక్స్ చైర్మన్ మారుతీ పటేల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలు ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు బాబా టైగర్, ఉట్నూర్ మాజీ మండల ఉపాధ్యక్షులు బాలాజీ, బి.ఆర్.ఎస్.వి జిల్లా అధ్యక్షులు దర్నీ రాజేష్, జవహర్, రవీందర్ తదితరులు పాల్గొని మారుతీ పటేల్ ను పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
నాయకులు మాట్లాడుతూ మారుతీ పటేల్ ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం, సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర భవిష్యత్తులో యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మారుతీ పటేల్ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజా సేవలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తానని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment