సహకార సంఘంలో రైతు పండుగ

సహకార సంఘంలో రైతు పండుగ

ఎమ్4 ప్రతినిధి ముధోల్

రాష్ట్ర ప్రభుత్వం రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు పండుగను మండల కేంద్రమైన ముధోల్ లోని సహకార సంఘంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ సీఈఓ సాయరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతు పండుగను నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని అచ్యుత, ఏసిఈఓ నాగేశ్వరరావు, సిబ్బంది రమేష్, పిఎసిఎస్ కార్యాలయం సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment