ఓటు మార్పుకు
తీర్పు కావాలి
(జూబ్లీ హిల్స్ శాసనసభ
నియోజక వర్గానికి నవంబర్11 న
జరగనున్న ఉప ఎన్నికల
సందర్భంగా రాసిన కవిత)
ఓటు హక్కు నీజన్మ హక్కు
ప్రజాస్వామ్యానికి పునాది
రాజ్యాంగం ఓటర్లకు కల్పించిన
వజ్రాయుధం బ్రహ్మాస్త్రం
ఓటు హక్కుఅవినీతి
అక్రమాలు కుట్ర కుల్లు
కుతంత్రాల నాయకులను
అడ్డుకునే ఆయుధం
ఓటు హింసా’ సంఘ
విద్రోహుల మతోన్మాద
ఉగ్రవాద విభజన శక్తుల
స్వైర విహారం అడ్డుకునే
శక్తి ఓటు హక్కుబ్యాలెట్
బుల్లెట్ కంటే గొప్ప
స్కాంలో వున్న క్రిమినల్స్
లాండ్ మాఫియా సాండ్
మాఫియా డ్రగ్స్ మాఫియా
పార్టీ మార్చిన అయారాం
గయారాం అవకాశవాద
రాజకీయాలకు ఓటుతో
చరమగీతం పాడాలి
ధనస్వాముల డబ్బు సంచుల
ప్రవాహాన్ని ప్రచార అట్టహాసం
అడ్డుకోవాలి అధికారం కోసం
అడ్డదారులు తొక్కే నాయకులకు
ఓటుతో చెక్కు పెట్టాలి
ఎన్నికలలో గెలవడానికి
ఎన్నెన్నో అడ్డదారులు
అమలు కానీ వాగ్దానాలు
మనీ మందు మాంసం
ఉచిత సైకిళ్ళు ల్యాప్ టాప్స్’
టి ‘విలు సారా చీరల పంపిణీ
ఆర్థిక ప్రలోభాలు గిఫ్ట్‌లు
ఉచిత హామీల అర్రాసు పాటలో
ఓటును నోటుకు అమ్ముకోకు
గత ఎన్నికల్లో ఇచ్చిన
వాగ్దానాలఅమలును
ప్రశ్నించు భావి ప్రగతికి
పాటుపడే అభ్యర్థికి ఓటేయి
ఓటు వేసే ముందు ఐదు
నిమిషాలు ఆలోచించు
ఐదు సంవత్సరాలప్రగతి శీల
ప్రణాళికలకు చోటియ్యు
ప్రజాస్వామ్య రక్షణలో
ఓటరే సైనికుడు
ఓటే వజ్రాయుధం
సంఘ విద్రోహులు
చట్ట దిక్కారును
ఎన్నుకోవద్దు
రేపిస్టులుమహిళలపై
లైంగిక వేదింపులు
అఘాయిత్యాలు
అత్యాచారాలు,
ఆసిడ్ దాడులు,
దౌర్జన్యాలు సర్కారు పోడు
బీడు బంజరు భూముల
చెరువుల,కుంటల
కబ్జాధారులను
చట్టసభల సభ్యులుగా
ఎన్నుకుంటే చట్టాలను
తమ చుట్టలుగా మార్చుకొని
అరాచక పాలనతో
సామాన్యుని సంక్షేమం
అభివృద్ధి సాధికారిత
ఎండమావి అవుతుంది
పోలింగు రోజు హాలిడే కాదు
మనల్ని పరిపాలించే
ప్రభుత్వాన్ని నడిపే ప్రజా
ప్రతినిధులను ఎన్నుకునే
పండుగ రోజు
మన సామాజిక ఆర్థిక విధ్య
వైద్య ఉద్యోగ జీవన ప్రమాణాల
విధానాలను నిర్ణయించుకునే
దిశ దశ మన తల రాతను
మార్చు కొనే రోజు
ప్రజాస్వామ్య రక్షణతోనే
సామాజిక న్యాయం
పంపిణీ న్యాయం
స్వయం సమృధ్ది
సమగ్రాభివృధ్దికి
నూతన క్రాంతికి
ఓటే పునాది
అభ్యర్థి ఏ పార్టీ వాడని
కాదుఏ పాటివాడో చూడు
బ్రూటులకు ఓటు వేయ వద్దు
నీ ఓటు మార్పుకునాంది
కావాలిభవిష్యత్తు ప్రగతికి
తీర్పు కావాలినీ ఓటు
పొద్దు పొడుపు కావాలి
బ్రహ్మాస్త్రంగా ఓటును
ప్రయోగించాలి.
నేదునూరి కనకయ్య
( నేదునూరి కళ్యాణ్)
ఫ్రీలాన్స్ రైటర్ కాలమిస్ట్
సామాజిక ఆర్థిక విశ్లేషకులు
కరీంనగర్ 9440245771