5వ షెడ్యూల్ ప్రాంతంలో ఇందిరమ్మ కమిటీలు చట్ట విరుద్ధం*

*5వ షెడ్యూల్ ప్రాంతంలో ఇందిరమ్మ కమిటీలు చట్ట విరుద్ధం*

👉 లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ బాధ్యత పిసా గ్రామ సభలదే.

*ఏజెన్సీ చట్టాలను దిక్కరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు*

👉 *ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి 2)

ఆదిలాబాద్// అక్టోబర్ 14

కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఇందిరమ్మ కమిటీ ఎంపిక ప్రక్రియ సరైన పద్ధతి కాదని ఏజెన్సీ ప్రాంతంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కీలక పాత్ర పిసా గ్రామసభలకే ఉంటుందని ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదలనూ, కాంగ్రెస్ ప్రభుత్వం కుడా యాదావీధిగా పాటిస్తూ, ఏ మాత్రం ఏజెన్సీ ప్రాంత చట్టాలు పట్టించుకోకుండా… ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పని చేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు .తేది:11.10.2024 నాడు జారి చేసిన జి.వో.33 ద్వారా తేది: 12.10.2024లోపు ఇందిరమ్మ ఇండ్ల పథకంనకు సంబంధించి ఇందిరమ్మ కమిటీలు వేయాలి అని దసరా సెలవుల సమయములో అది కూడా ఒక్కరోజులో వేయాలి అని ఇచ్చిన జి.వో.33 అనునది ఏజెన్సీ ప్రాంత చట్టాలకు విరుద్ధం. మరియు ఈ జి.వో ద్వారా వేసిన ఇందిరమ్మ కమిటీలు చట్ట ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో చెల్లుబాటు కాదని,5వ షెడ్యూల్ ప్రాంత పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు పథకం అమలు విషయములో PESA Act- 1996 చట్టం మరియు నిబంధనలు పాటించకుండా జారి చేసిన జి.వో.33, dt.11.10.2024 ను ఏజెన్సీ ప్రాంతంలో నిలుపదల చేయాలని మరియు ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ అనునది 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో PESA Act- 1996 చట్టం మరియు నిబందనలు అనుసారం పేసా గ్రామసభల ద్వారానే లబ్దిదారుల ఎంపిక LTR- 1/59, 1/70 చట్టాలకు లోబడి జరిగేలా తక్షణమే తగు చర్యలు తీసుకోగలరని ఆయన డిమాండ్ చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment