రాపాక వరప్రసాద్ మళ్లీ జనసేనలోకి చేరతారా?

Rapaka Varaprasad Attends Janasena Event
  • అంబేడ్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో జనసేన కార్యక్రమం
  • వైసీపీ నుంచి జనసేనలోకి రాపాక వరప్రసాద్ మళ్లీ చేరే ఆలోచనలో ఉన్నారని కేడర్ లో గుసగుసలు
  • డిప్యూటీ సీఎం నిర్ణయం పై ఆసక్తి

 

జనసేన పార్టీ నేతలు ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో నిర్వహించిన కార్యక్రమానికి రాపాక వరప్రసాద్ రావడం జనసేనలో మళ్లీ చేరతారా అనే ఊహాగానాలకు దారితీసింది. వైసీపీతో అసంతృప్తి వ్యక్తం చేసిన రాపాక జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

 

: జనసేన పార్టీ నేతలు ఆదివారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో నిర్వహించిన సమావేశంలో రాపాక వరప్రసాదరావు పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో జనసేన నుంచి వైసీపీలో చేరిన రాపాక అక్కడ తనకు కావాల్సిన గుర్తింపు లభించకపోవడంతో తిరిగి జనసేన గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. జనసేన కేడర్ లో దీనిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే, డిప్యూటీ సీఎం ఈ అంశంపై ఏ నిర్ణయం తీసుకుంటారో మరి వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment