.బతుకు పుస్తకం

బతుకు పుస్తకం
  • జీవితం అంటే ఒక పుస్తకం, ప్రతి అనుభవం పుటలవంటిది.
  • కాలం ఎంత వేగంగా గడుస్తుందో, పాఠాలను అర్థం చేసుకునే క్రమంలోనే నడుస్తుంది.
  • ఆనందాలు, కష్టాలు మరియు అనుభవాలను మనం చెయ్యవలసిన పుస్తకంలో నకిలీ వ్రాతలు లేవు.
  • ఆత్మవిశ్వాసంతో, మనం ముందుకు సాగాలి.

 

జీవితాన్ని ఒక పుస్తకంగా భావిస్తే, ప్రతి అనుభవం పుటలల్లా మారుతుంది. పాఠాలు అర్థం చేసుకునే ప్రయత్నంలో కాలం గడిచిపోయే సందర్భాలు చాలావరకు ఎదురవుతాయి. బాధలు, ఆనందాలు, ప్రతి అనుభవం మనసును నింపుతుంది, దాన్ని అర్థం చేసుకోవడం కష్టమైనా, జ్యోతికి జ్వాలలు లాంటిది. అందువల్ల, ఆరాటంతో ముందుకు సాగాలని సూచిస్తున్నాయి.

 

జీవితమనే పుస్తకాన్ని చదవటం మొదలు పెట్టిన క్షణం నుండి, కామాలు తప్ప విరామ చిహ్నాలు కనపడడం లేదు. ఒక్కొక్క పుట తిరగేస్తున్న కొద్ది, ఒక్కో అనుభవం సొభవిస్తుంది. కఠినమైన పాఠాలను అర్థం చేసుకునే లోపే కాలం గడిచి పోతుంది. అలాకాదు అని ఆపేపద్దామనుకుంటే, ఒక సారి పుస్తకం తెరిచాక అది పూర్తి చేయనిదే మూయటం అసంభవమని తెలుస్తుంది.

అక్షరాల వెంట పరుగులు తీస్తున్న కళ్ళకి కన్నీటి పొర కడలిని తలపిస్తుంది. కనపడని అక్షరాలన్ని మసకేసిన మనసును మదిస్తున్నాయి. ఆ మధనంలో వేదనలనే హాలా హలం ఉద్భవించి, గొంతు దాటలేక గోడు చెప్పుకోలేక, గోరంత దీపమై రెపరెపలాడుతుంది.

ఈ అనుభవంలో, ఆ జ్యోతి పరంజ్యోతిలో లీనమయేవరకు ఆరాటమనే చమురు పోరాటమనే వత్తివేసి వెలిగిస్తూనే ఉండాలి. అర్థం చేసుకున్న పాఠాలను మన జీవితం లో అంగీకరించుకోవాలి, అది మాకు ఒక అక్షరాలను, అనుభవాలను చేరవేయాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment