ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
శ్రీసత్యసాయి జిల్లా, అక్టోబర్ 11, 2024
శ్రీసత్యసాయి జిల్లాలోని 87 మద్యం దుకాణాలకు సంబంధించి దరఖాస్తుల గడువు శుక్రవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. జిల్లాలోని ధర్మవరం, సికె.పల్లి, పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి, కదిరి, హిందూపురం, తనకల్లు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఉన్న ఈ దుకాణాలకు మొత్తం 1460 దరఖాస్తులు సమర్పించబడ్డాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.