ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
భైంసా: అక్టోబర్ 11, 2024
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గట్టు మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పూజలు నిర్వహించి అరతి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
అతడు మెట్ల నిర్మాణం, ఆలయం చుట్టూ సి. సి. వేయడం, మరియు షెడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. గట్టు మైసమ్మ అందరిని చల్లగా చూడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.