- బొరేగం గ్రామానికి చెందిన స్వప్నకు డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం
- జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకుతో జయప్రాప్తి
- గ్రామ పెద్దలు, యువకుల సత్కారం
ముధోల్ మండలం బొరేగం గ్రామానికి చెందిన గట్టు స్వప్న డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ సైన్స్) విభాగంలో జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించి ఉద్యోగం పొందింది. స్వప్నను స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు విఠల్ కాంబ్లే పూల శాలువాతో సత్కరించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.
నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బొరేగం గ్రామానికి చెందిన గట్టు పోసాని-కాశీరాం దంపతుల కుమార్తె గట్టు స్వప్న ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ సైన్స్) విభాగంలో జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకును సాధించి, ప్రభుత్వ ఉద్యోగం పొందింది. స్వప్న విద్యాభ్యాసం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగింది. నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్న ఈ విజయంతో గ్రామస్థుల గర్వకారణంగా మారింది.
ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిర్మల్ జిల్లా చైర్మన్ విఠల్ కాంబ్లే ఆధ్వర్యంలో స్వప్నకు పూల శాలువతో ఘనంగా సత్కరించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆమె విజయానికి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో బాబు లింగం, హన్మాండ్లు, గిరి, రవి, రాజు, ముత్యం, దేవన్న, ప్రశాంత్, అఖిల్, ముత్తన్న, నారాయణ తదితరులు పాల్గొన్నారు.