వైభవంగా గంగానీళ్ల జాతర …
ఉదయం నుండి భక్తుల తాకిడి.
“అమ్మవారిని దర్శించుకున్న బిజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి”
నిర్మల్ జిల్లా –
సారంగపూర్ : మండలంలోని ఆడెల్లి మహాపోచమ్మ జాతర రెండు రోజుల పాటు జరిగిన గంగ పోచమ్మ జాతర ఆదివారం సాయంత్రం ముగిసింది.
జాతర సందర్బంగా బిజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొని అమ్మవారిని నగలను దర్శించుకున్నారు.
గంగ నీళ్ళ జాతర శనివారం మధ్యాహ్నం పోచమ్మ నగలను ఆడేల్లి దేవాలయం నుంచి వేలాది మంది భక్తులు కలినడకతో 30 కిలో మీటర్ల పాటు అడెల్లి,సారంగాపూర్, యకరపల్లి,
వంకరర్,ప్యారముర్,మడగాం, దిలార్ పూర్. బన్సపల్లి.కంజర్,మల్లాపూర్, మీదుగా సాంగ్వి గ్రామానికి చెరుకొని శనివారం అక్కడే బస చేసి.ఆదివారం ఉదయం గోదావరి నది జలాలతో నగలను శుద్ధి చేసి తిరిగి అదే దారి గుండా భక్తులు నగలను దేవాలయానికి చేరుకొన్నారు .గ్రామ గ్రామాన భజ భజంత్రీల నడుమ మంగళ హారతులతో స్వాగతం పలికి అమ్మవారి నగల మూటను దర్శించి మొక్కులను తీర్చుకున్నారు సాయంత్రానికి ఆలయానికి చేరుకున్నారు.
ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ భక్తులు తెచ్చిన
గంగ జలాలతో దేవిని అభిషేకంచేసి నూతన వస్త్రాలు కట్టి అమ్మవారిని నగలతో అలంకరించి మంగళ హారతులిచ్చారు. వచ్చిన భక్తులకు దేవి దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు అందిచారు. దీంతో జాతర ముగిసింది. ఆదివారం వేకువ జామున నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర లోని నాందేడ్ చంద్రపూర్,నాగపూర్ జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు భక్తులు కాలినడకన ప్రయివేట్ వాహనాలలో అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
” భారీ బందబస్తు”.
శనివారం ఉదయం, ఆదివారం సాయంత్రం వరకు జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈ.ఓ రమేష్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ జానకి షర్మిల ఆదేశానుసారం డీఎస్పీ గంగారెడ్డి అధ్వర్యంలో సీఐ రామకృష్ణ, స్థానిక ఎస్సై శ్రీకాంత్ బందోబస్తు నిర్వహించారు.
స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డ్రా.వేదవ్యాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
అవసరమైన భక్తులకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందజేశారు