బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని ఇచ్చిన అజ్ఞాతవాసి
నేటి నుంచి వజ్ర కిరీటంతో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
విజయవాడ : అక్టోబర్ 03
బెజవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాతవాసి బంగారం, వజ్రాలతో తయారు చేసిన 2.5 కోట్ల రూపాయల విలువైన కిరీటాన్ని సమర్పించారు. ఈ కిరీటం నేటి నుండి అమ్మవారికి అలంకరించి, వజ్ర కిరీటంతో బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ ప్రత్యేక ఆభరణంతో అమ్మవారి దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది.