- శ్రీ అక్షర పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండగ నిర్వహణ
- విద్యార్థులకు సాంప్రదాయ పద్ధతులపై అవగాహన పెంచడం
- పూలతో తయారు చేసిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తులు
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని శ్రీ అక్షర పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండగను నిర్వహించారు. డైరెక్టర్ సుభాష్, విద్యార్థులకు సాంప్రదాయాలను పాఠశాలలో నేర్పించడం ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు వివిధ పూలను సేకరించి అందమైన బతుకమ్మలను తయారుచేసి సంప్రదాయ దుస్తుల్లో పండుగను జరుపుకున్నారు.
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ అక్షర పాఠశాలలో సోమవారం ముందస్తు బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక సందర్భంగా డైరెక్టర్ సుభాష్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచే విద్యార్థులకు సాంప్రదాయ పద్ధతులను అలవర్చడం, పండగ పట్ల గౌరవాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఆదివారం సెలవు రోజు వివిధ రకాల పూలను సేకరించి అందమైన బతుకమ్మలను తయారుచేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థులు మది నిండగా బతుకమ్మ పూల పండుగను నిర్వహించారు.
అంతకుముందు, పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం, ముధోల్ ప్రధాన విధుల ద్వారా కోలాటాలతో బతుకమ్మ పాటలపై నృత్యాలు చేస్తూ, పెంటల చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొన్నారు.