రైతులకు కేంద్రం భారీ నిధుల కేటాయింపు

కేంద్రం రైతులకు రూ. 14 వేల కోట్ల నిధుల కేటాయింపు.
  1. కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 14 వేల కోట్ల నిధుల కేటాయింపు.
  2. డిజిటల్ అగ్రికల్చర్, క్రాప్ సైన్స్, లైవ్‌స్టాక్ హెల్త్ తదితర విభాగాలకు నిధులు.
  3. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్ కోసం రూ. 2 వేల కోట్ల కేటాయింపు.

 కేంద్రం రైతులకు రూ. 14 వేల కోట్ల నిధుల కేటాయింపు.

 కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. వ్యవసాయ సంబంధిత పథకాలకు మొత్తం రూ. 14 వేల కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ నిధులు డిజిటల్ అగ్రికల్చర్, క్రాప్ సైన్స్, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్, లైవ్‌స్టాక్ హెల్త్ వంటి విభాగాలకు కేటాయించారు.

 కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త అందించింది. వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడం, పంటల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం రూ. 14 వేల కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ నిధుల కేటాయింపులో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం రూ. 2 వేల కోట్లు, క్రాప్ సైన్స్‌కు రూ. 3 వేల కోట్లు, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్‌మెంట్ కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించారు.

లైవ్‌స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్ కోసం రూ. 1702 కోట్లు, క్రిష్ విజ్ఞాన కేంద్రం కోసం రూ. 1202 కోట్లు, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ కోసం రూ. 1115 కోట్లు కేటాయించారు. ఈ నిధులు రైతులకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వడంతో పాటు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు తోడ్పడనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment