ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న CSC VLE ని ఆదుకోవాలి

Alt Name: తెలంగాణ ఐటీ మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు తో సమావేశమైన CSC VLE సభ్యులు
  • తెలంగాణ CSC VLE డిజిటల్ సేవా సొసైటీ సమావేశం
  • ఐటీ మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు తో పథకాల గురించి చర్చ
  • ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలను మెరుగుపరచాలని డిమాండ్
  • ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులకు అనుమతి కోరారు

Alt Name: తెలంగాణ ఐటీ మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు తో సమావేశమైన CSC VLE సభ్యులు

నిర్మల్ జిల్లా CSC VLE డిజిటల్ సేవా సొసైటీ, తెలంగాణ ఐటీ మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు గారితో సమావేశమై, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలను మెరుగుపరచాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను CSC సెంటర్ ద్వారానే అమలు చేయాలని కోరగా, మంత్రి వెంటనే స్పందించారు. ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను అందించడంపై కూడా చర్చ జరిగింది.

Alt Name: తెలంగాణ ఐటీ మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు తో సమావేశమైన CSC VLE సభ్యులు

తెలంగాణ CSC VLE డిజిటల్ సేవా సొసైటీ-TCVDSS, రాష్ట్ర ఐటీ మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబు గారిని కలిసి సి ఎస్సి ద్వారా అందిస్తున్న సేవల గురించి వివరించారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న CSC VLE కి ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న సంక్షేమ పథకాలను CSC సెంటర్ ద్వారానే అమలు చేయాలని మంత్రి దూదిళ్ల శ్రీధర్ బాబును కోరగా, ఆయన వెంటనే స్పందించారు. సొసైటీ ప్రెసిడెంట్ A. జ్యోతి, వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ కర్ వినాయక్ తో కలిసి సి ఎస్సి సెంటర్ ద్వారా అందించే సేవల గురించి వివరించారు. అలాగే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నర్సింహా గారిని కలవడం జరిగింది. ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను సి ఎస్సి సెంటర్ కి అందించాలని కోరారు. మంత్రిగారు సర్వీసులను అందించేందుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు A. జ్యోతి, కళ్యాణ్ కర్ వినాయక్, R. వెంకటేశ్వర్లు, B. రాంబాబు, కస్తూరి నాగరాజు, G. నవీన్, డి. సునీల్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment