జిల్లా కు వరాల జల్లు
బహిరంగ సభ లో సీఎం రేవంత్ రెడ్డి.
నిర్మల్ జనవరి 16 మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి
నిర్మల్ జిల్లా: బాసర త్రిబుల్ ఐటీ లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం నిర్మల్ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ మిని స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. నిర్మల్ ఎమ్మెల్యే పేలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, ఖానాపూర్ బైంసా ఎమ్మెల్యేలు బొజ్జు పటేల్ రామారావు పటేల్ ఎంపీ నగేష్ తోపాటు మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వేణుగోపాల చారి,నియోజక వర్గం ఇంచార్జీ శ్రీహరి రావు లు హాజరైన ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభ కార్యక్రమంలో సీఎం జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మల్ లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనట్టు ప్రకటించారు. తన సొంత జిల్లా అయిన పాలమూరు తో పాటు సమానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసేందుకు పదివేల ఎకరాల భూసేకరణ చేపట్టి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించిన ప్రకటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సన్నబియ్యానికి 500 రూపాయల బోనస్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత సర్పంచి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోను ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ఎన్నికలప్పుడే రాజకీయాలం గురించి మాట్లాడదామని… రాజకీయాలకతీతంగా అభివృద్ధిని చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.