అనారోగ్య బాధితురాలిని తాజా మాజీ కౌన్సిలర్ పరామర్శ

నిర్మల్‌లో అనారోగ్య బాధితురాలిని తాజా మాజీ కౌన్సిలర్ పరామర్శ

నిర్మల్, జనవరి 14 — మనోరంజని తెలుగు టైమ్స్

నిర్మల్ గుల్జార్ మార్కెట్ 27వ వార్డుకు చెందిన అమీనా (వింతంతు) ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ నిర్మల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గుల్జార్ మార్కెట్ తాజా మాజీ కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ @ రఫ్ఫూ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు.
కౌన్సిలర్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఆందోళన చెందవద్దని ధైర్యం కల్పించారు. అల్లాహ్ తలా నుండి దువా చేయనున్నారు అని చెప్పారు. అలాగే వైద్య ఖర్చుల కోసం ఆర్ధిక సాయం అందించారు. మెరుగైన చికిత్స కోసం రాజధానికి వెళ్లినప్పుడు వారికి సౌకర్యం కల్పిస్తానని ఆశ్వాసనమిచ్చారు.
ఆపత్కాలంలో అండగా నిలబడిన నాయకుడి చర్యలను చూసి బాధిత కుటుంబ సభ్యులు తాజాగా మాజీ కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment