సంక్రాంతి సంబరాల్లో రంగుల హరివిల్లు.
సారంగాపూర్ జనవరి 14 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండల కేంద్రంలో పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జండా గల్లి లో సక్రాంతి సంబరాల్లో రంగుల హరివిల్లు..
ముగ్గుల పోటీ నిర్వహించారు.మహిళా ఆడపడుచుల వేసిన ముగ్గులను న్యాయ నిర్ణేతలు ఉపాధ్యాయులు మాధవి,రేణుక గార్లు ముగ్గుల తిలకించి
1.పైడిమర్రి నందిని.2.బాలే జ్యోతి.3.గుద్దేటి మౌనిక లని
విజేతలుగా ప్రకటించారు.
అంతరం పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి చేతులమీదుగా మొదటి బహుమతి రూ.5 వేలు
రూ.3 వేలు ,రూ.2 వేలు బహుమతులతో పాటు ప్రతి ఒక్కరికి ప్రోత్సాహ బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి,మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు దశరథ రాజేశ్వర్,నాయకులు నర్సారెడ్డి, నారాయణ రెడ్డి,సామల వీరయ్య,
నర్సగౌడ్,గ్రామ వార్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు.