నరేందర్ రెడ్డి దశదిన కర్మలో మనోహర్ రెడ్డి
కుటుంబానికి పరామర్శ
కామారెడ్డి జనవరి 14 మనోరంజని తెలుగు టైమ్స్
నాగిరెడ్డి పేట మండలం తాండూరు గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన దశదిన కర్మ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని భరోసా ఇచ్చి, వారిని ఓదార్చారు.
ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, హన్మంత్ రెడ్డి, మునగాపల్లి సంఘయ్య తదితరులు పాల్గొన్నారు.