సేవలో దైవత్వం చాటిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు
ప్రొద్దుటూరు: జనవరి 13 మనోరంజని తెలుగు టైమ్స్
ప్రొద్దుటూరు అన్నవరం ప్రాంతంలో టీ. వెంకట సుబ్బమ్మ అనే మహిళ అనారోగ్యం కారణంగా మృతి చెందింది. అంతిమ సంస్కరణలు చేయడానికి బందువులు ముందుకు రాకపోవడంతో, స్థానికులు మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్ ను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి, సుబ్బమ్మ గారి అంతిమ సంస్కరణలను హిందూ సంప్రదానం ప్రకారం హిందూ స్మశాన వాటికలో నిర్వహించారు.
ఈ గొప్ప కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, అహమ్మద్ హుస్సేన్, అశోక్ కుమార్, కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు ప్రసన్న కుమార్, కిరణ్ కుమార్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. వారి సహాయానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే, మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్ధులకు సహాయం చేయదలచిన ఏదైనా దాతలు ఈ క్రింది నంబర్లలో సంప్రదించవలసిందిగా సూచన చేశారు:
📞 82972 53484, 9182244150