సేవా కార్యక్రమాల్లో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ ప్రత్యేక గుర్తింపు
ప్రొద్దుటూరులో గుర్తుతెలియని వృద్ధుడి అంతిమ సంస్కారాలు నిర్వహణ
ప్రొద్దుటూరు, జనవరి 12 (మనోరంజని తెలుగు టైమ్స్):
సమాజ సేవల్లో తనదైన ముద్ర వేస్తూ మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది.
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందగా, అతని అంతిమ సంస్కారాలకు బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్ను ఫోన్ ద్వారా సంప్రదించారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు సోమవారం హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబాహన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, సెక్రటరీ నరేంద్ర కుమార్తో పాటు కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు పాపిశెట్టీ వెంకట లక్షుమ్మ, సుమన్ బాబు, ప్రసన్న కుమార్, నరేంద్ర తదితరులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
దాతలకు విజ్ఞప్తి
మా శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు ఈ క్రింది నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు.
📞 82972 53484, 91822 44150