బంధం లేని బాటలో దేవుళ్లై నిలిచారు – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
జమ్ములమడుగు, జనవరి 11, మనోరంజని తెలుగు టైమ్స్
జమ్ములమడుగు చింత కాంపౌండ్లో మలయత పద్మనాభం అనే వృద్ధుడు అనారోగ్యంతో మరణించగా, అంతిమ సంస్కరణలు చేయడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో స్థానికులు ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ను సంప్రదించారు.
ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి, ఆదివారం హిందూ సంప్రదాయం ప్రకారం హిందూ స్మశానవాటికలో అంతిమ సంస్కరణలు నిర్వహించారు.
ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించినందుకు ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, సుబహన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, కృప ఆగ్ని షారోన్ ట్రస్ట్ సభ్యులు కిరణ్ కుమార్, సుమన్ బాబు మరియు తదితరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
మా శ్రీ అమ్మ శరణాలయం వృద్ధులకు సహాయం చేయదలచిన ఎవరైనా దాతలు ఈ ఫౌండేషన్ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ల సంఖ్యలు:
82972 53484, 9182244150