నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ నేత బీజేపీలో చేరిక
నిర్మల్: జనవరి 10 మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి
నిర్మల్ పట్టణంలో ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనుముల శ్రవణ్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, శ్రవణ్‌ను పార్టీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి, కండువా వేసి శ్రవణ్‌ను పార్టీలో స్వాగతం చేసిన తర్వాత, నిర్మల్ పట్టణంలో కాషాయ జెండా ఎగరేసే విధంగా ప్రతీ ఒక్కరు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రామనాథ్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, జిల్లా బీజేవైఎం అధ్యక్షులు ఒడిసెల అర్జున్, పట్టణ బీజేపీ నాయకులు కూన శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నిర్మల్ పట్టణంలో బీజేపీ బలాన్ని మరింత పెంచడం లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయనున్నారు.