క్షయ వ్యాధిపై విస్తృత అవగాహన అవసరం

క్షయ వ్యాధిపై విస్తృత అవగాహన అవసరం

జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం ప్రత్యూష.

సారంగాపూర్ జనవరి 09 మనోరంజని తెలుగు టైమ్స్
క్షయ వ్యాధిపై విస్తృత అవగాహన అవసరం

నిర్మల్ జిల్లా, సారంగాపూర్:
సమాజంలో టీబీ ( క్షయ) వ్యాధి నివారణ కోసం ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం అని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం. ప్రత్యూష అన్నారు,శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చించోలి(బి) గ్రామంలో టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్ లో భాగంగా క్షయ వ్యాధి ఉచిత నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 65 మందికి ఉచితంగా డిజిటల్ ఎక్స్ రే పరీక్షలు చేశారు. జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నవారు టీబీ పట్ల జాగ్రత్త పడాలన్నారు. ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, రాత్రిపూట చమటలు పట్టడం, దగ్గినప్పుడు రక్తం పడటం, అలసట నీరసం, గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడిన వారు, చాతిలో నొప్పి, శరీరంలో ఏ భాగంలోనైనా వాపు లాంటి లక్షణాలు ఉన్నట్లయితే గ్రామాల్లో ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. అలాగే తెమడ పరీక్ష, ఎక్స్ రే పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెన్నెల సాయన్న, ఆరోగ్య పర్యవేక్షకులు కృష్ణ మోహన్ గౌడ్, సిబ్బంది రవి కిరణ్, పవన్, నుస్రత్, రాజేందర్, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment