జీవాలకు నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ

జీవాలకు నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ

బాసర, డిసెంబర్ 31 ( మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):

నిర్మల్ జిల్లా బాసర మండల పరిధిలోని ఓని గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలలో నట్టల నివారణకు ఉచిత కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పశు వైద్యుడు డా. రాజేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ చేసి వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే యజమానులు ఆలస్యం చేయకుండా వెంటనే పశు వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు. పశువులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచితే ఆరోగ్యంగా ఉండి సమృద్ధిగా పాలు ఇస్తాయని తెలిపారు. అలాగే గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయడం వల్ల అవి ఆరోగ్యంగా ఉండి ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ జగదీష్ పటేల్, ఉప సర్పంచ్ పురుషోత్తం, పశు వైద్య సిబ్బంది, జేవీఓ సుజాత, గోపాలమిత్ర గణేష్, ఓఎస్ వినాయకరావు, గొర్రెలు–మేకల యజమానులు హల్దేకర్ గోపి, కాలేవార్ దిగంబర్, గోవింద్, దశరథ్‌తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment